జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు ఏప్రిల్ 11 నుండి 13 వరకు జరుగనుండగా జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి శనివారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పరిశీలించారు. అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు ఇబ్బంది కలగకుండా లైట్స్, చలవ పందిర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. వారి వెంట ఆర్డీవో పాల్గొన్నారు.