జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అవినీతే రాజ్యమేలుతుందని ప్రముఖ ఉద్యమ కారుడు, జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. గ్రామ స్థాయి నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు అధికారులంతా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరును, వారి అవినీతికి అద్దం పడుతున్న తీరును ఆయన విలేఖరులకు వివరించారు. ఏకంగా జిల్లా ఉన్నతాధికారులే న్యాయస్థానాల తీర్పులను కూడా గౌరవించడం లేదన్నారు.