బుగ్గారం మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో శనివారం దాదాసాహెబ్ కాన్సిరాం 91వ జయంతి వేడుకలను నిర్వహించారు. కాన్సిరాం చిత్రపటానికి అంబేద్కర్ సంఘం నాయకులు దూడ లక్ష్మణ్, పోషరాజ్ లు పూలమాల వేశారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం బహుజన నాయకులు దూడ తిరుపతి మాట్లాడుతూ కాన్షిరాం సేవలను కొనియాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు రాజ్యాధికారానికి వచ్చినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుందన్నారు.