జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని బస్టాండ్ లో ప్రజల సౌకర్యార్థం అగస్త్య మహారాజ్ ఆదివారం చలివేంద్రాన్ని స్థాపించి ప్రారంభోత్సవం చేశారు. ఆయన స్థానిక శ్రీ సాంబ శివ నాగేశ్వరాలయ ప్రాంగణంలో అగస్త్య కామధేనువు గో సంరక్షణ గోశాల నిర్వహిస్తున్నారు. బస్టాండ్ లో ప్రజల ఇబ్బందులు గమనించిన ఆయన చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి గ్రామస్తులతో ప్రారంభోత్సవం చేశారు. చలివేంద్రం ఏర్పాటు పట్ల ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేశారు.