జగిత్యాల పట్టణంలోని గోవింద్ పల్లె శివారులో గల నవదుర్గ పీఠ క్షేత్రంలో శుక్రవారం పురస్కరించుకొని నవదుర్గ సేవాసమితి ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భజనాలు చేశారు. పీఠం మొత్తం జై దుర్గనామంతో మారుమ్రోగింది. అనంతరం అన్నదాతల సహకారంతో భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శీనయ్య, మహేష్, భక్తులు పాల్గొన్నారు.