జగిత్యాల జిల్లా పొలాసలో విషాద ఘటన జరిగింది. మొదటి భార్య జమున, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో జీవిస్తున్న కమలాకర్ అనే వ్యక్తి.. కొద్ది రోజుల క్రితం మరో వివాహం చేసుకున్నాడు. దీంతో జమునకు, కమలాకర్‌కు విభేదాలు రావడంతో తరచుగా గొడవలు జరుగుతుండేవి.ఈ క్రమంలో శనివారం కమలాకర్ మొదటి భార్యతో గొడవ చేశాడు. భార్య అతనిపై కత్తితో దాడిచేసి, ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. కమలాకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.