ఉద్యోగ, ఉపాధ్యాయులకు పిఆర్సిని వెంటనే ప్రకటించాలి
ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు పిఆర్సిని వెంటనే ప్రకటించాలని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. కొండాపూర్ మండలంలో సంఘ సభ్యత్వ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏ లను కూడా విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి శ్రీనివాసరావు, నాయకులు పాల్గొన్నారు.