గ్రామ దేవతలారా భూములు కాపాడండి అంటూ రైతుల నిరసన

74பார்த்தது
ఫార్మాసిటీ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకొని తమ భూములు కాపాడేలా చూడాలంటూ న్యాల్కల్ మండలం డప్పురు గ్రామ మహిళా రైతులు గురువారం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. తమకు ఈ భూమిని జీవనాధారం అని ఫార్మసిటీ పేరు మీద తీసుకుంటే ఎలా బతకాలని మహిళలు ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతామని చెప్పారు.

தொடர்புடைய செய்தி