ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనింగ్ కాంప్లెక్స్ ఆపరేటర్‌గా ఉన్న
రిలయన్స్ ఇండస్ట్రీస్ రష్యాకు చెందిన రోస్నెఫ్ట్తో ఒప్పందం కుదుర్చుకుంది. నెలకు కనీసం 3 మిలియన్ బ్యారెళ్ల చమురును రష్యా కరెన్సీ రుబెళ్లలో కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ డీల్ ఒక ఏడాదిపాటు కొనసాగుతుందని కంపెనీ వర్గాలు చెప్పాయి. రోస్నెఫ్ట్తో కుదిరిన ఈ డీల్ వల్ల
రిలయన్స్ రాయితీ ధరలకే చమురు పొందనుంది.