రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో బాబుల్ రెడ్డి నగర్ లో మంగళవారం ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి ఆయుష్మాన్ భారత్ ఆభా కార్డు సర్వే నిర్వహించి ఆభా కార్డు హాస్పిటల్ కు లింక్ చేశారు. ప్రతీ ఒక్కరు ఆయుష్మాన్ భరత్ ఆభా కార్డు పొందాలన్నారు. అదేవిదంగా హాస్పిటల్ కు లింక్ చేసుకోవాలన్నారు. ఆశా వర్కర్లు ఏ. సరిత, మంగ, లక్ష్మి, సునీత, రేణుక, మాన్యమ్మ పాల్గొన్నారు.