
రాజేంద్రనగర్: అమావాస్య సందర్భంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు
అమావాస్య సందర్బంగా రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో మార్కండేయ నగర్ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి అమావాస్యకు దాతల సహకారంతో అన్న వితరణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు శనివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు, దాతలు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు.