ఎగువ కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి గరిష్ఠ నీటిమట్టంతో నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రాజెక్టులో 700 అడుగుల నీటిమట్టం ఉందని గురువారం అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 982 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో కుడి, ఎడమ కాలువలకు 886, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.