ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుందని బుధవారం ఉదయం అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం పూర్తిగా నిండి ఉందని తెలిపారు. ప్రాజెక్టులోకి 902 క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా వివిధ అవసరాల కోసం 902 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు అధికారులు వెల్లడించారు.