నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో నిర్వహించిన మద్దెలమ్మ తల్లి బోనాల పండుగలో సోమవారం ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.