నల్లగొండ పట్టణంలోని 8వ వార్డ్ అక్కలాయి గూడెంకి చెందిన ఆర్థోపెడిక్ డాక్టర్ ఐ. కామేశ్వర్ మాతృమూర్తి ఇరిగి దుర్గమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ బుధవారం ఆమె మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రామరాజు దుర్గమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని, ప్రగాఢ సానుభూతిని తెలిపారు.