వైసీపీ నేతల రాజీనామాల పరంపర కొనసాగుతోంది. తాజాగా మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ వైసీపీని వీడనున్నారు. బుధవారం ఆమె అధికారికంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ఇటీవల తన్నీరు నాగేశ్వరరావును మాజీ సీఎం జగన్ జగ్గయ్యపేట ఇన్ఛార్జ్గా నియమించారు. ఆ సీటును ఆశించిన వాసిరెడ్డి పద్మకు నిరాశ ఎదురైంది. దాంతో ఆమె రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది.