నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం నాలుగు గంటలకు మేఘాలు దట్టంగా కనుక్కొని చీకటిని తలపించేలా చేశాయి. ప్రధాన రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి పత్తి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.