నల్గొండ జిల్లా చింతపల్లి, పీఏ పల్లి మండలాల్లో సీసీఐ ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాలను బుధవారం ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రారంభించారు. రైతులు నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాల్లో పత్తిని విక్రయించి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మాల్, దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్లు అలివేలు సంజీవ రెడ్డి, జమున, స్థానిక నేతలు నాగభూషణం, సిరాజ్ ఖాన్, జాలా, తదితరులు పాల్గొన్నారు.