దేవరకొండ నియోజకవర్గంలోని చిన్న అడిశర్లపల్లి, అంగడిపేట ఎక్స్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీ ప్రకారం సన్నాలకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ అమలు చేసి రైతులకు అండగా నిలిచామన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వేణుధర్ రెడ్డి, మాధవరెడ్డి, సిరాజ్ ఖాన్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.