నల్గొండ జిల్లా దేవరకొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడి సీజ్ అయిన వాహనాలను ఈనెల 24వ తేదీన వేలం వేయనున్నట్లు సీఐ శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనేవారు 24వ తేదీన ఉదయం 10 గంటల వరకు స్టేషన్ లో డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలని, వేలంలో వాహనాలు దక్కనివారికి డిపాజిట్ తిరిగి చెల్లిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.