దేవరకొండలో బీఆర్ఎస్ నిరసనలు

54பார்த்தது
రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందంటూ ఆదివారం దేవరకొండ పట్టణంలో బిఆర్ఎస్ శ్రేణుల నిరసనలు చేపట్టారు. కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గాజుల ఆంజనేయులు, రాజు, జానీబాబ, కృష్ణ, రాములు, తదితర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி