చిన్ననాటి స్నేహితునికి ఆర్థిక సహాయం అందజేత

2228பார்த்தது
చిన్ననాటి స్నేహితునికి ఆర్థిక సహాయం అందజేత
సింగరేణి హై స్కూల్ సిసిసి పాఠశాలలో తమతో పాటు చదువుకున్న చిన్ననాటి స్నేహితుడు మంచిర్యాల లోని మారుతి నగర్లో నివాసం ఉంటున్న ఆవునూరి సత్యనారాయణ అనే పోలీస్ కానిస్టేబుల్ అనారోగ్యంతో బాధ పడుతూ ఉండగా స్పందించిన అతని చిన్ననాటి స్నేహితులు మంచిర్యాల లోని తన నివాసంలో అతనిని పరామర్శించి 35,500 రూపాయలు ఆర్థిక సహాయం, అలాగే క్వింటా బియ్యం, తదితర సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా వారు అతని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఇక ముందు ఎలాంటి అవసరం ఉన్నా తమకు సమాచారం అందించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అప్పలకొండ బండి రమేష్, వెంకటరమణ, గోపాల్, సుధాకర్, వెంకటేశ్వర్లు, వెంకట్రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி