మంచిర్యాలలోని ఏసీసీ సాయి నగర్ కు చెందిన మూడేళ్ళ బాలుడు శనివారం వేడి సాంబారులో పడి తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడి తల్లిదండ్రులు శ్యామల శ్యామ్ కుమార్ ఒక ఛారిటబుల్ ట్రస్ట్ కు ఇంటి వద్ద వంట చేసి పంపిస్తుంటారు. ఈ క్రమంలో సిద్దంగా ఉన్న వేడి సాంబారులో పడడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి వైద్యానికి దాతలు సహాయం అందించాలని తల్లిదండ్రులు కోరారు.