కారుణ్య నియామకాలలో భాగంగా శ్రీరాంపూర్ ఏరియాలో నియామకం పొందిన 52 మంది యువతీ-యువకులకు బుధవారం జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ కారుణ్య నియామకాలు చేపడుతూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందని, దక్షిణ భారతదేశంలోనే సింగరేణి సంస్థ దేశానికే తలమానికంగా ఉందని అన్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న ఉద్యోగులు గైర్హాజరు కాకుండా ఉద్యోగం చేసుకోవాలన్నారు.