మంచిర్యాల జిల్లాలో 21వ అఖిలభారత పశుగణనను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ పశుగణన సర్వే వచ్చే యేడాది ఫిబ్రవరి 29 వరకు కొనసాగుతుందని ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్లు, ఇతర జీవాల సమాచారాన్ని డిజిటల్ పద్ధతిలో సేకరిస్తామని తెలిపారు. జిల్లాలో పశుగణనకు 127 మంది ఎన్యుమరేటర్లను నియమించి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.