శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నిటిమట్టంతో జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు నీటిమట్టం 148 మీటర్లకు గాను ప్రస్తుతం అంతే స్థాయిలో నీటిమట్టం ఉంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 20. 175 టీఎంసీలకు 20. 1754 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 58, 517 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. 15 గేట్లు ఎత్తి అంతే మేర నీటిని దిగువకు వదులుతున్నారు.