చెన్నూరు పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చెన్నూర్ రహదారి పక్కన ఉన్న చెరువు మత్తడి పేల్చిన దుండగులను శిక్షించడంలో పోలీసులు అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే వివేక్ సరైన విధంగా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.