చెన్నూర్ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి విద్యుత్ కేంద్రం అతిథి గృహంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనులతో పాటు పెండింగ్ పనులను పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.