మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 10వ వార్డులో శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల సమాచార సేకరణ సర్వేలో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు వార్డుకు సంబంధించిన లబ్ధిదారులు వారికి సంబంధించిన సంక్షిప్త సమాచారాన్ని వివరించి అధికారులకు సహకరించాలని స్థానిక వార్డు ప్రజలను కోరారు.