బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు బ్యాక్ లాగ్ పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ శంకర్ శనివారం తెలిపారు. ఈనెల 11వ తేదీ వరకు ఒకటి, మూడు, ఐదవ సెమిస్టర్ల రెగ్యులర్ తోపాటు బ్యాక్ లాగ్ ఫీజులను చెల్లించవచ్చని చెప్పారు. పరీక్ష ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఆన్ లైన్ లో చెల్లించడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు.