అధికారికంగా గుర్తింపు పొందిన తమ సంఘంపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు హెచ్చరించారు. ఆదివారం పట్టణంలో చిలుక రాజనర్సు అథ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. దళిత సంఘాల ఐక్యవేదిక అని చెప్పుకుంటున్న నాయకులు బ్లాక్మెయిల్ రాజకీయాలు ఇక చెల్లవని ఆరోపించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి దళిత సంఘాల ఐక్య వేదికను గతంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు.