బెల్లంపల్లి: సమగ్ర ఇంటింటి సర్వేను విజయవంత చేయాలి

58பார்த்தது
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వేను విజయవంతం చేయాలని బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ తెలిపారు. ‌సోమవారం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ 6 నుంచి 20 వరకు సర్వే ప్రతిరోజు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி