నెన్నెల మండలం కృష్ణపల్లి గ్రామానికి చెందిన అఘోరి మాత కుటుంబ సభ్యులు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆత్మార్పణం చేసుకోవడం పరిష్కారం కాదని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కుటుంబ సభ్యులకు సూచించారు.