కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సందర్భంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు పరచడంలో విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మందమర్రిలో ఏర్పాటు చేసిన పార్టీ జిల్లా మహాసభలు ముగింపు కార్యక్రమానికి శనివారం ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వం గ్యారెంటీలను అమలు చేయకుండా హైడ్రా పేరుతో చెరువులు, కుంటలు ఆక్రమించారంటూ పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లను ధ్వంసం చేసిందన్నారు.