మొబైల్ వాట్సాప్లకు వచ్చే గుర్తు తెలియని ఏపీకే అప్లికేషన్లను డౌన్లోడ్ చేయవద్దని వీటిపై అప్రమత్తంగా ఉండాలని మందమర్రి ఎస్సై రాజశేఖర్ శనివారం సూచించారు. మందమర్రి మండలం చిర్రకోట గ్రామానికి చెందిన రాజేందర్ ఇదేవిధంగా అప్లికేషన్ను క్లిక్ చేసి అతనికి తెలియకుండానే తన బ్యాంకు ఖాతా నుంచి రూ.50 వేలు పోయినట్లు మెసేజ్ రావడంతో సైబర్ మోసానికి గురైనట్లు వివరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.