బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు పోలీస్ భద్రతను మరింత పెంచారు. వారం రోజుల క్రితం మావోయిస్టులు హెచ్చరిస్తూ లేఖ విడుదల చేయడంతో ముందస్తు జాగ్రత్తగా భద్రతను కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్ నుంచి బెల్లంపల్లికి వచ్చే ఎమ్మెల్యేకు అంగరక్షులకు ఇప్పటివరకు భద్రత కల్పించగా పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలతో భద్రతను పెంచి రక్షణ చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా రోప్ టీం ను శుక్రవారం ఏర్పాటు చేశారు.