బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముల్కల్ల మల్లారెడ్డి, కొయ్యల ఏమాజి ఆధ్వర్యంలో సోమవారం భారత్ - భూటాన్ - నేపాల్ ఆధ్యాత్మిక విహార యాత్ర చేపట్టారు బెల్లంపల్లిలో యాత్రా బస్సును కౌన్సిలర్ అనిత జాతీయ జెండా ఊపి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ భారత్, భూటాన్, నేపాల్ లోని దేవాలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, టూరిస్ట్ ప్రదేశాలు సందర్శించడం జరుగుతుందని తెలిపారు.