రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించాలని బెల్లంపల్లి ఏరియా జిఎం శ్రీనివాస్ అన్నారు. శనివారం బెల్లంపల్లి ఏరియాలోని గనులు, ఓసి, ఇతర విభాగాల ఉన్నతాధికారులతో శనివారం జీఎం కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 25 నుంచి జరిగే రక్షణ పక్షోత్సవాలను పురస్కరించుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.