లేబర్ సైట్ ను వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ ఎంసీపీఐ (యూ), ఏఐసీటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కాంటా చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ అసంఘటిత కార్మికుల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. గత రెండు నెలలుగా కార్మిక శాఖకు చెందిన ఆన్లైన్ సైట్ పనిచేయకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.