పంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ ఎంపీడీఓ సూపరిం టెండెంట్ శ్రీనివాసులుకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. గ్రామ పంచాయతీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టంగుటూరి నరసింహారెడ్డి పాల్గొని మాట్లాడుతూ కార్మిక చట్టాలను అమలు చేయాలన్నారు. ప్రభుత్వమే కార్మికులకు గుర్తింపు కార్డులు, 2 జతల బట్టలు, వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.