అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూర్ మండలంలో నిర్మాణం చేసే ఉమామహేశ్వర రిజర్వాయర్ ప్రాజెక్టును ప్రభుత్వం రైతుల భూములు కోల్పోకుండా డిజైన్లు మార్చాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు ప్రభుత్వాన్ని గురువారం డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో భూములు కోల్పోవాల్సి వస్తే తిరిగి రైతులకు భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో భూములు కోల్పోతున్న రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని భరోసానిచ్చారు.