ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వేను పక్కడబందీగా చేయాలని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన కల్వకుర్తి నియోజకవర్గం వెల్డండ మండలం కంటోనిపల్లి గ్రామంలో జరుగుతున్న సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఫ్యామిలీ డేటా బేస్ ఆధారంగా అధికారులు సర్వే నిర్వహిస్తున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు.