రెండు లక్షల వరకు రుణాలు తీసుకున్న ప్రతి రైతు రుణం మాఫీ చేయాలని జిల్లా జల సాధన సమితి కో కన్వీనర్ నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఉట్కూర్ మండలం బిజ్వార్ గ్రామంలో రైతులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో సిఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రైతులందరి రుణాలు మాఫీ చేయాలని, చాలా మంది రైతుల రుణాలు మాఫీ కాలేదని అన్నారు. ప్రభుత్వం రుణాలు మాఫీ చేశామని చెప్పడం అబద్ధమని అన్నారు.