భద్రాద్రి జిల్లా బూర్గంపహడ్ మండల కేంద్రంలో బుధ, గురు, శుక్ర మూడు రోజులుగా ముంచెత్తి పోసేలా వర్షం కురుస్తోంది. వాతావరణం సాధారణ స్థితికి చేరి ఉన్నట్టుండి ఒక్క సారిగా బిందెలతో ముంచెత్తి పోస్తున్నట్టుగా వర్షం కురుస్తోంది. ఈ వర్షంతో రైతులకు మాత్రం అధిక లాభమే కానీ నష్టం కాదు అని వారు భావిస్తున్నారు. కానీ కొందరి రైతుల గుండెల్లో గోదావరి రాక అనే భయం మాత్రం ఉంది.