కిన్నెరసానికి వరద పోటు

80பார்த்தது
కిన్నెరసాని రిజర్వాయర్ 2 గేట్లు ఎత్తి వరద నీటిని సోమవారం దిగువకు విడుదల చేశారు. ఉదయం 6 గంటలకు ఇన్ ఫ్లో 1, 000 క్యూసెక్కులు ఉండటంతో ఒక గేటు పైకెత్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇన్ ఫ్లో 6 వేల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో మరో గేటు పైకెత్తారు. మొత్తం 8 వేల క్యూసెక్కుల వరద దిగువకు విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభావిత ప్రాంతాల్లో సైరన్లతో అధికారులు హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி