చుంచుపల్లి మండలంలోని పోలీస్ స్టేషన్ లో నూతనంగా ఏర్పాటు చేయబడిన డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్స్ కో-ఆర్డినేషన్ సెంటర్ ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ శనివారం ప్రారంభించారు. నేటి నుండి సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. దీని టోల్ ఫ్రీ నెంబర్ 1930 కాల్ చేసి సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ సహాయం తీసుకోవచ్చు అని తెలిపారు.