ఘనంగా ప్రారంభమైన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

66பார்த்தது
కాగజ్‌నగర్‌ పట్టణం సర్ సిల్క్ కాలనీలో గల రాంమందిర్ దేవాలయం వద్ద ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళలు, యువతుల ఆటపాటలతో సందడి నెలకొంది. చిన్నా పెద్ద అందంగా, సాంప్రదాయంగా ముస్తాబై తీరొక పూలతో అలంకరించిన బతుకమ్మలను తెచ్చి ఒక చోట చేర్చారు. వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ ఆడిపాడుతూ ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. బతుకమ్మ ఆడుకోవడానికి మున్సిపాలిటీ వారు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி