ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 3, 54, 691 మంది ఓటర్లు

80பார்த்தது
ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 3, 54, 691 మంది ఓటర్లు
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని 15 మండలాల ఓటర్ల వివరాలను ముఖ్య ఎన్నికల అధికారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 మండలాల్లో 1, 77, 105 పురుషుల ఓట్లు ఉండగా 1, 77, 567 మహిళల ఓట్లు ఉన్నాయి. 19 థర్డ్ జెండర్ ఓట్లు ఉన్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. పురుషుల కంటే మహిళలు 462 ఓట్లు అధికంగా ఉన్నాయన్నారు. జిల్లాలో మొత్తం 3, 54, 691 మంది ఓటర్లు ఉన్నట్లుగా తెలిపారు.

தொடர்புடைய செய்தி