
ఆసిఫాబాద్: బస్ సౌకర్యం కల్పించాలని వినతిపత్రం అందజేత
ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలంలోని రవీందర్ నగర్ నుండి బూరెపల్లి వరకు బస్ సౌకర్యం కల్పించాలని డిపో మేనేజర్ కు గురువారం గ్రామస్తులు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ బస్ సౌకర్యం లేకఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం ప్రీ బస్ పథకం ప్రవేశపెట్టినప్పటి నుండి మాకు బస్ సౌకర్యం లేదని విద్యార్థులు పాఠశాలలకు, కాలేజీలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నామని ఆటోలు అధిక రేట్లు తీసుకుంటున్నారన్నారు.