అంతర్గత రోడ్ల నిర్మాణానికై కలెక్టర్ కు వినతి

75பார்த்தது
అంతర్గత రోడ్ల నిర్మాణానికై కలెక్టర్ కు వినతి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ లో శుక్రవారం జిల్లా కలెక్టర్ వేంకటేశ్ దౌత్రె ను రెబ్బెన మండలం గంగాపుర్ గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఎస్సీ, బీసీ కాలనీలలో అంతర్గత సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్ లను మంజూరు చేయించాలని కలెక్టర్ను కోరడం జరిగింది. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ గ్రామ సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గంగాపూర్ గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி